రఘురామ కేసులో సీఐడీ కోర్టు ఆదేశాలపై హైకోర్టులో ప్రభుత్వం పిటిషన్   

17-05-2021 Mon 11:52
  • హైకోర్టులో లంచ్ మోష‌న్ పిటిష‌న్ దాఖ‌లు
  • ర‌ఘురామకు వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌న్న ఆదేశాల‌పై పిటిష‌న్
  • ప్ర‌భుత్వ పిటిష‌న్‌ను స్వీక‌రించిన‌ ధ‌ర్మాస‌నం
ap govt files petition

వైసీపీ అసంతృప్త ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జ‌రుగుతోంది. రఘురామకృష్ణరాజు బెయిల్ పిటిషన్ విచారణను మధ్యాహ్నం 12 గంటలకు సుప్రీంకోర్టు వాయిదా వేసిన విష‌యం తెలిసిందే. అయితే, మ‌రోవైపు ర‌ఘురామ‌కృష్ణ‌రాజు కేసులో సీఐడీ కోర్టు ఆదేశాలపై ఏపీ ప్ర‌భుత్వం హైకోర్టులో లంచ్ మోష‌న్ పిటిష‌న్ దాఖ‌లు చేసింది. ర‌ఘురామ‌కృష్ణ‌రాజుకు వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌న్న ఆదేశాల‌పై ఈ పిటిష‌న్ వేసింది. ప్ర‌భుత్వ పిటిష‌న్‌ను ధ‌ర్మాస‌నం విచార‌ణకు స్వీక‌రించింది.