యాక్షన్ మూవీని పక్కన పెట్టిన నాగార్జున!

17-05-2021 Mon 11:48
  • ప్రవీణ్ సత్తారు రూపొందించిన యాక్షన్ కథ 
  • భారీ బడ్జెట్ కేటాయించవలసిన కథ
  • పూర్తి స్క్రిప్ట్ పట్ల సంతృప్తి చెందని నాగ్
  • 'బంగార్రాజు'పైనే నాగ్ దృష్టి  
Nagarjuna hold praveen sattaru movie

నాగార్జున .. ప్రవీణ్ సత్తారు కాంబినేషన్లో ఒక భారీ యాక్షన్ సినిమా రూపొందనున్నట్టుగా వార్తలు వచ్చాయి. గతంలో రాజశేఖర్ తో ప్రవీణ్ సత్తారు చేసిన 'గరుడ వేగ' తరహాలోనే ఈ సినిమా సాగుతుందని చెప్పారు. ఈ సినిమాకి భారీ బడ్జెట్ అవుతుందని అన్నారు. కరోనా కాలం తరువాత ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందనే వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్టును నాగ్ హోల్డ్ లో పెట్టినట్టుగా వార్తలు వస్తున్నాయి. దాదాపుగా ఆగిపోయిందని అనుకోవాలనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ప్రవీణ్ సత్తారు వినిపించిన కథకు బడ్జెట్ భారీగానే అవుతుందట. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆ స్థాయి బడ్జెట్ పెట్టడం సాహసమే అవుతుందని నాగార్జున భావించినట్టుగా తెలుస్తోంది. అంతేకాదు .. కథ విషయంలో కూడా నాగ్ పూర్తిస్థాయిలో సంతృప్తి చెందలేదట. అందువల్లనే కొంతకాలం వెయిట్ చేద్దామని హోల్డ్ లో పెట్టారని అంటున్నారు. ప్రస్తుతం నాగార్జున తన పూర్తి దృష్టిని 'బంగార్రాజు'పైనే పెట్టాలని నిర్ణయించుకున్నారట. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేసే ఉద్దేశంతో ఆయన ఉన్నారు. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ నటించనుందనే సంగతి తెలిసిందే.