స్టాలిన్ ఆదేశాలతో బాధితుడికి జరిమానా డబ్బును వెనక్కి ఇచ్చిన పోలీసులు
- హెల్మెట్ లేదంటూ రూ. 500 జరిమానా విధించిన పోలీసులు
- దీంతో కొడుక్కి మందులు కొనలేకపోయిన బాధితుడు
- ట్విట్టర్ ద్వారా స్టాలిన్ దృష్టికి తీసుకెళ్లిన వైనం
అయితే, తన కొడుక్కి మందులు కొనేందుకు తన వద్ద కేవలం రూ. 1,000 మాత్రమే ఉన్నాయని, తనకు జరిమానా విధించవద్దని పోలీసులను బాలచంద్రన్ వేడుకున్నాడు. అయినా కనికరించని పోలీసులు అతనికి రూ. 500 జరిమానా విధించడంతో... మందులు కొనుక్కోకుండానే అతను ఇంటికి చేరుకున్నాడు. ఆ తర్వాత ఇదే విషయాన్ని ట్విట్టర్ ద్వారా సీఎం స్టాలిన్ దృష్టికి తీసుకెళ్లారు.
దీనిపై స్పందించిన స్టాలిన్... జరిమానాను వెనక్కి ఇచ్చేయాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. అనంతరం బాలచంద్రన్ ఇంటికి వెళ్లిన తిరువళ్లూర్ తాలూకా సీఐ జరిమానా కింద వసూలు చేసిన రూ. 500 చెల్లించి క్షమాపణ కోరారు. మరోవైపు, తన విన్నపం పట్ల తక్షణమే స్పందించిన స్టాలిన్ కు బాలచంద్రన్ కృతజ్ఞతలు తెలిపారు.