బాలకృష్ణ సినిమాకి శ్రుతిహాసన్ గ్రీన్ సిగ్నల్?

17-05-2021 Mon 09:56
  • జులైలో పూర్తికానున్న 'అఖండ'
  • దసరాకి రిలీజ్ చేసే ఆలోచన
  • అదే రోజున సెట్స్ పైకి గోపీచంద్ మలినేని మూవీ 
  • మూడో ఛాన్స్ కొట్టేసిన శ్రుతిహాసన్    
Sruthi Haasan gave a green signal to Balakrishna movie

బాలకృష్ణ .. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా రూపొందనుంది. ఈ సినిమాకి సంబంధించిన సన్నాహాలను గోపీచంద్ మలినేని ఆల్రెడీ మొదలుపెట్టేశాడు. రాయలసీమ నేపథ్యంలోనే ఈ కథ నడుస్తుందని అంటున్నారు. వేటపాలెం గ్యాంగ్ ఎపిసోడ్ కూడా ఈ సినిమాలో ఉండనుంది. ఈ సినిమాలో కథానాయికగా శ్రుతిహాసన్ ను అనుకుంటున్నట్టుగా వార్తలు వచ్చాయి. గోపీచంద్ మలినేని గతంలో చేసిన 'బలుపు' సినిమాలో ఆమెనే హీరోయిన్. అలాగే ఇటీవల చేసిన 'క్రాక్' సినిమాలో కూడా తనే కథానాయిక.

ఆ రెండు సినిమాలు భారీ విజయాలను అందుకోవడంతో, ఆమె ఎంపిక గోపీచంద్ మలినేనికి సెంటిమెంట్ గా మారిపోయింది. అందువల్లనే ఆమెను మళ్లీ సంప్రదించినట్టుగా వార్తలు వచ్చాయి. ఇక ఆయన అడగ్గానే శ్రుతి హాసన్ కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనేది తాజా సమాచారం. ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ చేస్తున్న 'అఖండ' సినిమా జులైలో పూర్తి కానుంది. దసరాకి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. దసరాకే గోపీచంద్ మలినేని సినిమాను లాంచ్ చేయాలనుకుంటున్నారట.