గోదావరిఖనిలో పోలీసులను లాఠీలతో చితకబాదిన మధ్యప్రదేశ్ కూలీలు

17-05-2021 Mon 07:58
  • సింగరేణిలోని ఓ ప్రైవేటు కంపెనీలో కూలీలుగా పనిచేస్తున్న నిందితులు
  • రాత్రి కోల్‌బెల్ట్ వంతెన దాటుతుండగా అడ్డుకున్న పోలీసులు
  • వారి నుంచి లాఠీలు లాక్కుని దాడి
Madhypradesh workers attacked on telangana police

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో తెలంగాణ పోలీసులపై మధ్యప్రదేశ్ కూలీలు దాడికి దిగారు. గతరాత్రి జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. సింగరేణి ఓసీపీ-3 ప్రాజెక్టులోని ప్రైవేటు ఓబీ కంపెనీలో మధ్యప్రదేశ్‌కు చెందిన ఐదుగురు వ్యక్తులు కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్నారు. గతరాత్రి వీరు కోల్‌బెల్ట్ వంతెన దాటేందుకు ప్రయత్నిస్తుండగా లాక్‌డౌన్ విధుల్లో ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. వారి నుంచి వివరాలు సేకరించే ప్రయత్నం చేయగా పోలీసుల చేతుల్లోంచి లాఠీలు తీసుకున్న నిందితులు ఏఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లు, ఇద్దరు గార్డులపై దాడిచేశారు. ఏఎస్సై వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు సదరు కార్మికులను అదుపులోకి తీసుకున్నారు.