కరోనాతో బీసీసీఐ రెఫరీ రాజేంద్ర జడేజా మృతి

17-05-2021 Mon 07:33
  • 1975-87 కాలంలో సౌరాష్ట్రకు సేవలు
  • రెఫరీగా 53 ఫస్ట్ క్లాస్ మ్యాచులు సహా పలు మ్యాచ్‌లకు సేవలు
  • రాజేంద్రతో కలిసి మ్యాచ్‌లు ఆడిన రవిశాస్త్రి
 BCCI match referee Rajendrasinh Jadeja dead

కరోనా బారినపడిన బీసీసీఐ రెఫరీ, సౌరాష్ట్ర మాజీ పేసర్ రాజేంద్ర సిన్హ్ జడేజా మృతి చెందారు. ఆయన వయసు 66 సంవత్సరాలు. రాజేంద్ర మరణం బాధాకరమని సౌరాష్ట్ర క్రికెట్ సంఘం తెలిపింది. సౌరాష్ట్రకు అత్యుత్తమ సేవలు అందించిన పాతతరం క్రీడాకారుడని క్రికెట్ సంఘం కొనియాడింది. బీసీసీఐ రెఫరీగా రాజేంద్ర 53 ఫస్ట్‌క్లాస్, 18 లిస్ట్-ఎ, 34 టీ20లకు సేవలు అందించారు. టీమిండియా ప్రస్తుత కోచ్ రవిశాస్త్రి.. రాజేంద్రతో కలిసి జోనల్ క్రికెట్ ఆడాడు. రాజేంద్ర మృతికి సంతాపం తెలిపాడు.

కాగా, 1975-87 కాలంలో సౌరాష్ట్రకు ఆడిన రాజేంద్ర 50 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 134 వికెట్లు పడగొట్టాడు.1,536 పరుగులు చేశాడు. లిస్ట్-ఎ మ్యాచుల్లో 14 వికెట్లు పడగొట్టి 104 పరుగులు సాధించాడు.