సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

17-05-2021 Mon 07:28
  • విజయ్ దేవరకొండకు జంటగా కృతి సనన్
  • మరో చిత్రానికి వరుణ్ తేజ్ గ్రీన్ సిగ్నల్  
  • ఓటీటీ ద్వారా రానున్న 'రొమాంటిక్'
Kruti Sanan opposite Vijay Devarakonda

*  ప్రస్తుతం ప్రభాస్ హీరోగా రూపొందుతున్న 'ఆదిపురుష్' సినిమాలో కథానాయికగా నటిస్తున్న బాలీవుడ్ భామ కృతిసనన్ త్వరలో మరో తెలుగు సినిమాలో నటించే అవకాశం కనిపిస్తోంది. విజయ్ దేవరకొండ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందే పాన్ ఇండియా మూవీలో హీరోయిన్ గా ఆమెను తీసుకుంటున్నట్టు తాజా సమాచారం.
*  ప్రస్తుతం 'గని' సినిమాలో బాక్సర్ పాత్రలో నటిస్తున్న మెగా హీరో వరుణ్ తేజ్ దీని తర్వాత వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఇటీవల వెంకీ వినిపించిన కథ నచ్చడంతో వరుణ్ తేజ్ ఆ ప్రాజక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
*  పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి హీరోగా అనిల్ పాదూరి దర్శకత్వంలో రూపొందిన 'రొమాంటిక్' సినిమా ఓటీటీ ద్వారా రిలీజవ్వనుందని తెలుస్తోంది. నెట్ ఫ్లిక్స్ ఈ చిత్రానికి భారీ ఆఫర్ ఇచ్చిందని, త్వరలోనే ఈ ఓటీటీ సంస్థ ద్వారా ఇది రిలీజ్ అవుతుందని అంటున్నారు. ఇందులో కేతిక శర్మ హీరోయిన్ గా నటించింది.