ఎన్440కె వ్యాపిస్తోందంటూ భయపెట్టారు: మంత్రి అప్పలరాజుపై పోలీసులకు ఫిర్యాదు

17-05-2021 Mon 07:14
  • మైలవరం పోలీస్ స్టేషన్‌లో న్యాయవాది ఫిర్యాదు
  • కేసు నమోదు చేసి దర్యాప్తు జరపాలన్న న్యాయవాది
  • ఇదే కారణంతో చంద్రబాబుపైనా వివిధ ప్రాంతాల్లో కేసులు
Lawyer Complaint Against AP Minister Appalaraju

ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారంటూ న్యాయవాది ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌లోని ఎన్440కె రకం వ్యాపిస్తోందని మంత్రి చెప్పడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని కృష్ణా జిల్లా మైలవరం మండలం పొందుగులకు చెందిన న్యాయవాది భూక్య మల్లికార్జునరావు మైలవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్న మంత్రిపై కేసు నమోదు చేసి సమగ్ర విచారణ జరపాలని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, ఇలాంటి ఆరోపణలతోనే టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుపైనా రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.