పుష్ప శ్రీవాణి ఎస్టీనే... తేల్చిన విచారణ కమిటీ

16-05-2021 Sun 20:00
  • ఏపీ డిప్యూటీ సీఎం కులంపై వివాదం
  • పిటిషన్ వేసిన రేగు మహేశ్
  • విచారణకు ఆదేశించిన కోర్టు
  • పుష్ప శ్రీవాణి కొండదేవర కులస్తురాలేనన్న కమిటీ
Committee declares AP Dy CM Pushpa Srivani a Scheduled Tribe

ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి సామాజిక వర్గంపై నెలకొన్న వివాదం పటాపంచలైంది. పుష్ప శ్రీవాణి ఎస్టీనే అని విచారణ కమిటీ (డీఎల్ఆర్ సీ) తేల్చింది. పుష్ప శ్రీవాణి ఎస్టీ సామాజిక వర్గమైన కొండదొర కులానికి చెందిన మహిళ అని కమిటీ నిర్ధారించింది. ఎన్నికల అఫిడవిట్లో పుష్ప శ్రీవాణి పొందుపరిచిన కులం నిజమేనని డీఎల్ఆర్ సీ ప్రకటించింది.

పుష్ప శ్రీవాణి గిరిజనురాలు కాదంటూ గతంలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం న్యాయ సలహాదారు రేగు మహేశ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాంతో, ఈ వ్యవహారంపై విచారణ జరపాలని కోర్టు డీఎల్ఆర్ సీ విచారణకు ఆదేశించింది. దీనిపై విచారణ జరిపిన కమిటీ పుష్ప శ్రీవాణి గిరిజనురాలేనని స్పష్టం చేసింది.