మంత్రి వెల్లంపల్లిని పరామర్శించిన వైసీపీ నేతలు

16-05-2021 Sun 19:46
  • ఇటీవల వెల్లంపల్లికి పితృవియోగం
  • అనారోగ్యంతో వెల్లంపల్లి సూర్యనారాయణ మృతి
  • వెల్లంపల్లి నివాసానికి వెళ్లిన మిథున్ రెడ్డి, తలశిల
  • సూర్యనారాయణ చిత్రపటం వద్ద నివాళులు
YSRCP leaders visits Vellampalli house

ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఇటీవలే పితృవియోగం పొందారు. వెల్లంపల్లి తండ్రి సూర్యనారాయణ కొన్నిరోజుల కిందట అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ నేపథ్యంలో మంత్రి వెల్లంపల్లిని వైసీపీ నేతలు పరామర్శించారు.

విజయవాడ బ్రాహ్మణవీధిలోని వెల్లంపల్లి నివాసానికి ఎంపీ మిథున్ రెడ్డి, ప్రభుత్వ కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్ వెళ్లారు. వెల్లంపల్లి తండ్రి సూర్యనారాయణ చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని వెల్లంపల్లికి సూచించారు.