Raghu Rama Krishna Raju: జిల్లా కోర్టు నుంచి హైకోర్టుకు చేరిన రఘురామ వైద్య పరీక్షల నివేదిక

District court sends Raghurama medical report to high court
  • గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో రఘురామకు వైద్య పరీక్షలు
  • కొద్దిసేపటి కిందట జిల్లా కోర్టుకు రిపోర్టు సమర్పణ
  • ప్రత్యేక మెసెంజర్ ద్వారా ఆ రిపోర్టును హైకోర్టుకు పంపిన జిల్లా కోర్టు
  • కాసేపట్లో హైకోర్టు నిర్ణయం వెలువరించే అవకాశం
ఎంపీ రఘురామకృష్ణరాజుకు కాళ్లకు గాయాలు ఎలా తగిలాయన్న దానిపై గుంటూరు జీజీహెచ్ లో వైద్య పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ వైద్య నివేదికను మెడికల్ బోర్డు జిల్లా కోర్టుకు నివేదించగా, జిల్లా కోర్టు ఆ నివేదికను పరిశీలించిన మీదట హైకోర్టుకు అందజేసింది. రఘురామ వైద్య పరీక్షల నివేదికను ఓ ప్రత్యేక మెసెంజర్ ద్వారా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్ నివాసానికి పంపింది. హైకోర్టు ఈ మెడికల్ రిపోర్టును పరిశీలించి కాసేపట్లో నిర్ణయం వెలువరించే అవకాశాలున్నాయి.

అంతకుముందు, జీజీహెచ్ లో వైద్య పరీక్షలు పూర్తికావడంతో ఎంపీ రఘురామకృష్ణరాజును పోలీసులు గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో ఆయన వైద్య పరీక్షల నివేదికపై విచారణ అనంతరం హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తి కలిగిస్తోంది.
Raghu Rama Krishna Raju
Medical Report
GGH
District Court
AP High Court
AP CID
District Jail
Guntur

More Telugu News