ఢిల్లీలో లాక్​ డౌన్​ మరో వారం పొడిగింపు

16-05-2021 Sun 12:59
  • వచ్చే సోమవారం వరకు అమల్లోకి
  • కరోనా కేసులు చాలా వరకు తగ్గాయన్న కేజ్రీవాల్
  • ఇప్పుడు కాడి వదిలేస్తే మొదటికే ముప్పని ఆందోళన
Delhi extends Lockdown one more week

ఢిల్లీలో లాక్ డౌన్ ను మరో వారం పాటు పొడిగించారు. లాక్ డౌన్ తో ప్రస్తుతం కేసులు చాలా వరకు తగ్గాయని, మహమ్మారి తీవ్రతను మరింతగా తగ్గించేందుకు మరో వారం పాటు లాక్ డౌన్ ను పొడిగిస్తున్నామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఫ్రకటించారు. కరోనా పాజిటివిటీ రేట్ 5 శాతం కన్నా దిగువకు తీసుకురావడమే లక్ష్యమన్నారు.

ఇప్పటిదాకా కరోనా కట్టడిలో చాలా వరకు విజయం సాధించామని, ఇలాంటి సమయంలో కట్టడి కాడిని వదిలేస్తే పరిస్థితి మొదటికొచ్చే ప్రమాదముందని అన్నారు. వచ్చే సోమవారం వరకు (24వ తేదీ) ఉదయం 5 గంటల వరకు లాక్ డౌన్ అమల్లో ఉంటుందన్నారు.