Wrestler Sushil Kumar: జూనియర్ రెజ్లర్ హత్య కేసు.. సుశీల్‌కుమార్‌పై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ

Delhi court issues non bailable warrant against wrestler Sushil Kumar
  • రెజ్లర్ల మధ్య జరిగిన ఘర్షణలో సాగర్ ధన్‌కర్ మృతి
  • అప్పటి నుంచి అజ్ఞాతంలో సుశీల్ కుమార్
  • సాగర్‌పై దాడిలో సుశీల్ పాల్గొన్నట్టు వీడియో ఫుటేజీలు
జూనియర్ రెజ్లర్ సాగర్ ధన్‌కర్ (23) హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత దిగ్గజ రెజ్లర్ సుశీల్ కుమార్‌పై నిన్న నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. సుశీల్ కుమార్ ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నాడు. ఢిల్లీలోని చత్రసాల్ స్టేడియంలో ఇరు వర్గాల రెజ్లర్ల మధ్య ఘర్షణలో సాగర్ మృతి చెందాడు. ఈ ఘటనలో సుశీల్ కుమార్ అతడి స్నేహితులపై కేసులు నమోదయ్యాయి. ఘటన తర్వాత సుశీల్ కుమార్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అతడి జాడ లేకపోవడంతో గత ఆదివారం పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.

తాజాగా నిన్న సుశీల్‌తోపాటు మరో ఆరుగురిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. సుశీల్‌పై వారెంట్ జారీ చేసేందుకు కోర్టు అనుమతిచ్చిందని పోలీసులు తెలిపారు. సాగర్‌, అతడి స్నేహితులపై హాకీ, బేస్‌బాల్ బ్యాట్లతో జరిగిన దాడిలో సుశీల్ కుమార్ స్వయంగా పాల్గొన్నట్టు వీడియో ఆధారాలు కూడా లభించాయని కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలిపారు.
Wrestler Sushil Kumar
New Delhi
Murder Case
warrant

More Telugu News