Raghu Rama Krishna Raju: గాయాలతో కుంటుకుంటూ జడ్డి ముందుకు వెళ్లిన రఘురామ... వీడియో ఇదిగో!

Raghurama limps into court
  • నిన్న అరెస్టయిన రఘురామకృష్ణరాజు
  • పోలీసులు కొట్టారంటూ జడ్జికి ఫిర్యాదు
  • నడిచేందుకు ఇబ్బందిపడిన ఎంపీ
  • రఘురామ కేసు విచారణకు స్పెషల్ బెంచ్
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును సీఐడీ అధికారులు ఇవాళ న్యాయస్థానంలో హాజరుపరచగా, ఆయన కుంటుకుంటూ వచ్చారు. తనను పోలీసులు కొట్టారంటూ కాలి గాయాలను ఆయన తన న్యాయవాదులకు చూపించారు. కోర్టు ఆవరణలో కారు దిగిన రఘురామకృష్ణరాజు నడవడానికి ఇబ్బందిపడిన వైనం వీడియోలో కనిపించింది.

కాలికి తగిలిన గాయాలను కూడా ఆయన ప్రదర్శించిన ఫొటోలలో దర్శనమిచ్చాయి. కాగా, నిన్న రాత్రి తనను సీఐడీ పోలీసులు కొట్టారంటూ రఘురామ నేడు సీఐడీ కోర్టు న్యాయమూర్తికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అటు, రఘురామ కేసును విచారించేందుకు హైకోర్టులో జస్టిస్ ప్రవీణ్, జస్టిస్ లలిత నేతృత్వంలో స్పెషల్ బెంచ్ ఏర్పాటైనట్టు తెలుస్తోంది.
Raghu Rama Krishna Raju
CID Court
Police
Arrest
YSRCP

More Telugu News