తెలంగాణలో కొత్తగా 4,298 మందికి కరోనా పాజిటివ్

15-05-2021 Sat 19:47
  • గత 24 గంటల్లో 64,362 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 601 పాజిటివ్ కేసులు
  • రాష్ట్రంలో మరో 32 మంది మృతి
  • కోలుకున్న 6,026 మంది
  • తెలంగాణలో రికవరీ రేటు 89.33 శాతంగా నమోదు
Telangana corona cases deatails

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 64,362 కరోనా పరీక్షలు నిర్వహించగా 4,298 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 601 కేసులు గుర్తించారు. మేడ్చల్ లో 328, రంగారెడ్డి జిల్లాలో 267 కొత్త కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 6,026 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులు కాగా, 32 మంది మరణించారు.

రాష్ట్రంలో ఇప్పటిదాకా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 5,25,007కి పెరిగింది. 4,69,007 మంది కరోనా నుంచి బయటపడ్డారు. మొత్తం మరణాల సంఖ్య 2,928కి చేరింది. ఇక, తెలంగాణలో కరోనా రోగుల రికవరీ రేటు 89.33 శాతంగా నమోదైంది. జాతీయస్థాయిలో రికవరీ రేటు 83.8 శాతం కాగా, తెలంగాణలో ఆ రేటు ఆశాజనకంగా ఉంది.