ఎయిరిండియాపై అమెరికా కోర్టులో దావా వేసిన కెయిర్న్ ఎనర్జీ
- ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ ట్రైబ్యునల్ లో సుదీర్ఘ కాలం నడిచిన వివాదం
- 1.2 బిలియన్ డాలర్లను చెల్లించాలని ట్రైబ్యునల్ తీర్పు
- విదేశాల్లోని భారత్ ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి యత్నిస్తున్న కెయిర్న్
న్యూయీర్క్ సదరన్ డిస్ట్రిక్ట్ కోర్టులో కెయిర్న్స్ వేసిన పిటిషన్ లో... ఎయిర్ ఇండియా భారత ప్రభుత్వ యాజమాన్య కంపెనీ అని, చట్ట పరంగా భారత ప్రభుత్వం నుంచి ఈ సంస్థ వేరు కాదని పేర్కొంది. భారత ప్రభుత్వానికి, ఎయిర్ ఇండియాకు తేడా ఉందనే విషయం భ్రమ అని తెలిపింది.
ఇందులో భాగంగానే అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, సింగపూర్, క్యూబెక్ కోర్టులో కేసులు వేసింది. మరోవైపు దీనిపై భారత అధికారులు స్పందిస్తూ, ఆర్బిట్రేషన్ అవార్డును అమలు చేయడానికి ప్రొసీడింగ్స్ ప్రారంభమైతే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. మన దేశ ప్రయోజనాలు, సార్వభౌమ హక్కులను కాపాడుకోగలమని తెలిపారు.