'ఎఫ్ 3'లో వరుణ్ చేసే సందడి ఎక్కువట!

15-05-2021 Sat 17:52
  • భారీ వసూళ్లు తెచ్చిన 'ఎఫ్ 2'
  • భార్యలు వలన వచ్చే ఫ్రస్ట్రేషన్ 
  • డబ్బు తెచ్చే ఫ్రస్ట్రేషన్ తో 'ఎఫ్ 3'
  • ఆగస్టుకు థియేటర్లకు రానట్టే
F3 is going to hit on the theatres on Sankranthi

అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఇంతకుముందు వచ్చిన 'ఎఫ్ 2' సినిమా భారీ విజయాన్ని సాధించింది. విడుదలైన ప్రతి ప్రాంతం నుంచి విపరీతమైన వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఉన్నప్పటికీ వెంకటేశ్ చేసిన సందడి ఎక్కువ. 'వెంకీ ఆసనం' అంటూ ఆయన చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఈ సినిమాలో వెంకటేశ్ - వరుణ్ తేజ్ ఒకే ఇంటికి అల్లుళ్లు అవుతారు. భార్యలు పెట్టే బాధలు తట్టుకోలేక వాళ్లు ఇల్లొదిలి వెళ్లిపోతారు. అలాంటి ఆ కథకు సీక్వెల్ గా 'ఎఫ్ 3' సినిమాను అనిల్ రావిపూడి రూపొందిస్తున్నాడు.

ఈ మధ్యనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లింది.. కొంతవరకూ షూటింగు జరుపుకుంది కూడా. అయితే కరోనా కారణంగా ప్రస్తుతం షూటింగు ఆగిపోయింది. త్వరలోనే మళ్లీ సెట్స్ పైకి వెళ్లనుందని అంటున్నారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ కామెడీ ఎక్కువగా ఉంటుందని చెప్పుకుంటున్నారు. ఈ సారి అంతా కూడా డబ్బువలన వచ్చే ఫ్రస్ట్రేషన్ చుట్టూ కథ తిరగనుంది. నిజానికి ఈ సినిమాను ఈ ఆగస్టులో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ అనుకున్న విధంగా షూటింగు జరగకపోవడం వలన, 'సంక్రాంతి'కి వాయిదాపడే అవకాశాలు ఉన్నాయి.