త్రివిక్రమ్ .. మహేశ్ మూవీ నుంచి రానున్న టైటిల్ పోస్టర్

15-05-2021 Sat 17:20
  • 'సర్కారువారి పాట'తో బిజీగా మహేశ్
  • నెక్స్ట్ మూవీ త్రివిక్రమ్ తో
  • ఈ నెల 31న కృష్ణ బర్త్ డే
  • టైటిల్ పోస్టర్ రిలీజ్ కి సన్నాహాలు  
Title poster from Trivikram and Mahesh Babu movie

త్రివిక్రమ్ .. మహేశ్ బాబు కాంబినేషన్లో ఇంతకుముందు 'అతడు' .. 'ఖలేజా' సినిమాలు రూపొందాయి. మూడో సినిమాకి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన కథపైనే త్రివిక్రమ్ కసరత్తు చేస్తున్నారు. త్రివిక్రమ్ ఈ సినిమాకి 'పార్థు' అనే టైటిల్  అనుకుంటున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే, మరోపక్క, ఆయన సెంటిమెంట్ ప్రకారం టైటిల్ 'అ' అక్షరంతోనే మొదలుకానుందని మరికొంతమంది కూడా అంటున్నారు. ఈ సస్పెన్స్ కి ఈ నెల 31వ తేదీతో తెరపడనుందని చెబుతున్నారు.

ఈ నెల 31వ తేదీన కృష్ణ పుట్టినరోజు .. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని త్రివిక్రమ్ - మహేశ్ బాబు సినిమా నుంచి టైటిల్ పోస్టర్ రానున్నట్టుగా చెబుతున్నారు. అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయని అంటున్నారు. అయితే 'సర్కారు వారి పాట' నుంచి కూడా టీజర్ వచ్చే అవకాశం ఉందనే టాక్ వచ్చింది. సినిమా విడుదలకి ఇంకా చాలా సమయం ఉన్నందున అప్పుడే వద్దని మహేశ్ అనడం వలన ఆగిందని అంటున్నారు. త్రివిక్రమ్ - మహేశ్ మూవీలో కథానాయికగా పూజ హెగ్డే పేరు వినిపిస్తోంది.