రఘురామకృష్ణరాజుకు గుంటూరు సీఐడీ కార్యాలయంలో వైద్య పరీక్షలు పూర్తి

15-05-2021 Sat 16:41
  • రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీ
  • రఘురామ బెయిల్ పిటిషన్ ను తిరస్కరించిన హైకోర్టు
  • కాసేపట్లో రఘురామ కోర్టులో హాజరు
  • సన్నాహాలు చేస్తున్న సీఐడీ అధికారులు
Medical checkup for Raghurama Krishna Raju completed

ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించారన్న అభియోగాలపై అరెస్ట్ చేసిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును కాసేపట్లో కోర్టులో హాజరుపర్చనున్నారు. బెయిల్ కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, రఘురామకృష్ణరాజుకు గుంటూరు సీఐడీ కార్యాలయంలోనే వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయనను కోర్టుకు తరలించేందుకు సన్నద్ధమవుతున్నారు. కోర్టు రిమాండ్ విధిస్తే రఘురామను జైలుకు తరలించనున్నారు.

కాగా, హైకోర్టు సూచనల మేరకు రఘురామకృష్ణరాజు దిగువ కోర్టులో సోమవారం నాడు బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు, రఘురామ కస్టడీని కోరుతూ సీఐడీ అధికారులు పిటిషిన్ వేయనుండగా, ఈ రెండు పిటిషన్ల విచారణలు సమాంతరంగా జరగనున్నాయి.