మమతా బెనర్జీ ఇంట విషాదం

15-05-2021 Sat 15:23
  • కరోనాతో కన్నుమూసిన మమత సోదరుడు
  • పన్నీర్ సెల్వం ఇంట కూడా విషాదం
  • సంతాపం తెలిపిన స్టాలిన్
Mamata banerjee brother died with Corona

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె తమ్ముడు అషిమ్ బెనర్జీ కరోనా కారణంగా మృతి చెందారు. బెంగాల్ లో కరోనా కేసులు అమాంతం పెరుగుతున్న సంగతి తెలిసిందే. నిన్న ఒక్కరోజే బెంగాల్ లో 20 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 136 మంది మృతి చెందారు.

ఇదే సమయంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఇంట కూడా విషాదం నెలకొంది. పన్నీర్ సెల్వం సోదరుడు బాలమురుగన్ మృతి చెందారు. ఆయన వయసు 55 సంవత్సరాలు. బాలమురుగన్ మృతి పట్ల ముఖ్యమంత్రి స్టాలిన్ సంతాపం వ్యక్తం చేశారు. పన్నీర్ సెల్వంకు స్వయంగా ఫోన్ చేసి ఓదార్చారు.