మీకు ఎవరెవరు సహకరిస్తున్నారు?: రఘురాజుకు సీఐడీ ప్రశ్నలు

15-05-2021 Sat 14:45
  • నిన్న అర్ధరాత్రి వరకు రఘురాజును ప్రశ్నించిన సీఐడీ అధికారులు
  • ప్రస్తుతం సీఐడీ కార్యాలయంలోనే ఉన్న రఘురాజు
  • ఆయనకు ఆహారాన్ని అందిస్తున్న వ్యక్తిగత సిబ్బంది
Who are suppoting you asks CID to Raghu Rama Krishna Raju

ఎంపీ రఘురామకృష్ణరాజును నిన్న ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయనను హైదరాబాద్ నుంచి గుంటూరుకు తీసుకెళ్లారు. నిన్న రాత్రి నుంచి ఆయన సీఐడీ కార్యాలయంలోనే ఉన్నారు. మరోవైపు నిన్న అర్ధరాత్రి వరకు సీఐడీ అడిషనల్ డీజీ సునీల్ కుమార్ నేతృత్వంలో ప్రశ్నించారు. విచారణకు సంబంధించి వివరాలు బయటకు వెల్లడి కానప్పటికీ... విశ్వసనీయ సమాచారం ప్రకారం... మీకు వెనుక నుంచి ఎవరెవరు సహకరిస్తున్నారని ప్రశ్నించినట్టు తెలుస్తోంది.

మరోవైపు రఘురాజుకు ఈ ఉదయం వైద్యులు పరీక్షలను నిర్వహించారు. జీజీహెచ్ వైద్యుల పర్యవేక్షణలో పరీక్షలు జరిగాయి. ఆయనకు అవసరమైన మందులు, ఆహారాన్ని ఆయన వ్యక్తిగత సిబ్బంది సీఐడీ కార్యాలయంలో అందించారు. హైకోర్టు ఆదేశాల మేరకు సీఐడీ అధికారులు వీటిని అందజేశారు.