Covishield: తెలంగాణలో నేడు, రేపు వ్యాక్సినేషన్ ప్రక్రియ నిలిపివేత

Telangana govt stops covishield vaccination drive today and tomorrow
  • కొవిషీల్డ్ టీకా తొలి, రెండో డోసు మధ్య వ్యవధి పెంపు
  • కేంద్రం ఆదేశాలతో టీకా కార్యక్రమం నిలిపివేత
  • తిరిగి 17 నుంచి ప్రారంభం
తెలంగాణలో నేడు, రేపు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొవిషీల్డ్ తీసుకునే వ్యవధిలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల మార్పులు చేసింది. తొలి డోసుకు, రెండో డోసుకు మధ్య 12 నుంచి 16 వారాల వ్యవధి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

నేడు, రేపు కొవిషీల్డ్ స్పెషల్ డ్రైవ్‌ను నిలిపివేస్తున్నట్టు ప్రకటించిన ప్రభుత్వం తిరిగి 17న ప్రారంభించనున్నట్టు తెలిపింది. కాగా, ఇప్పటి వరకు కొవిషీల్డ్ టీకాను తొలి, రెండో డోసులను 6-8 వారాల వ్యవధిలో ఇచ్చారు.
Covishield
Vaccination
Telangana

More Telugu News