రూ.కోటి విరాళం అందజేసిన రజనీకాంత్‌ రెండో కుమార్తె సౌందర్య

14-05-2021 Fri 20:17
  • తమిళనాడులో కరోనా విలయతాండవం
  • ప్రజలను ఆదుకునేందుకు ముందుకు వస్తున్న సినీతారలు
  • సీఎం సహాయనిధికి భారీ విరాళాలు
  • సీఎం స్టాలిన్‌‌కు విరాళం అందజేసిన సౌందర్య
Rajanikanth second daughter donated rs 1 crore to CM Relief fund

తమిళ సినీ తారలు తెరపైనే కాదు.. విరాళాలివ్వడంలోనూ పోటీ పడుతున్నారు. ఇప్పటికే హీరో అజిత్‌, డైరెక్టర్‌ మురుగదాస్‌ సీఎం స్టాలిన్‌కు తమ వంతు సాయం అందించగా.. తాజాగా రజనీకాంత్‌ రెండో కుమార్తె సౌందర్య కూడా ఈ జాబితాలో చేరారు. సీఎం స్టాలిన్‌ను కలిసి తన భర్త విశాగన్‌ తరఫున రూ. కోటి విరాళంగా ఇచ్చారు.

అంతకుముందు అజిత్‌ రూ. 25 లక్షలు, మురుగదాస్ రూ.25 లక్షలు, సూర్య, ఆయన సోదరుడు కార్తీ కలిసి రూ.కోటి సీఎంకు అందించారు. తమిళనాడులో కరోనా విలయతాండవం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సినీ తారలు ప్రజలకు సహాయం అందించడంతో పాటు వైద్య సదుపాయాల ఏర్పాటు నిమిత్తం సీఎం సహాయనిధికి విరాళాలు అందజేస్తున్నారు.