తెలంగాణలో కొత్తగా 4,305 కరోనా పాజిటివ్ కేసులు, 29 మరణాలు

14-05-2021 Fri 19:47
  • గత 24 గంటల్లో 57,416 కరోనా టెస్టులు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 607 కొత్త కేసులు
  • ఇతర జిల్లాల్లోనూ తగ్గిన కేసులు
  • యాక్టివ్ కేసుల సంఖ్య 54,832
Telangana covid health bulletin

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 57,416 కరోనా టెస్టులు నిర్వహించగా 4,305 మందికి పాజిటివ్ అని వెల్లడైంది. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 607 కేసులు నమోదయ్యాయి. గత కొన్నిరోజుల కిందటి తీవ్రతతో పోల్చితే ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో తక్కువ సంఖ్యలోనే కేసులు నమోదవుతున్నాయి. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 6,361 మంది కరోనా నుంచి కోలుకోగా... 29 మంది మరణించారు.

తెలంగాణలో ఇప్పటివరకు 5,20,709 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 4,62,981 కొవిడ్ ప్రభావం నుంచి బయటపడ్డారు. ఇంకా 54,832 మంది చికిత్స పొందుతున్నారు. మొత్తం మరణాల సంఖ్య 2,896కి పెరిగింది.