కేరళలో మరో వారం రోజులు లాక్‌డౌన్‌ పొడిగింపు!

  • ప్రకటించిన సీఎం పినరయి విజయన్‌
  • నాలుగు జిల్లాల్లో ట్రిపుల్‌ లాక్‌డౌన్‌
  • ఈ జిల్లాలలో మరింత కఠిన ఆంక్షలు  
  • జూన్‌లోనూ ఆహార కిట్ల పంపిణీ
Kerala Extends Lockdown

కేరళలో కరోనా కేసుల సంఖ్య  ఏమాత్రం తగ్గకపోవడంతో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్‌ను మరో వారం పాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. మహమ్మారి తీవ్రత ఎక్కువగా ఉన్న తిరువనంతపురం, త్రిశూర్‌, ఎర్నాకుళం, మలప్పురంలో మరో వారం ట్రిపుల్‌ లాక్‌డౌన్‌ ఉంటుందని స్పష్టం చేసింది. ఈ జిల్లాల్లో మరింత కఠిన ఆంక్షలు అమలు చేయనున్నారు.

మే 8న ప్రారంభమైన లాక్‌డౌన్‌ వాస్తవానికి మే 16తో ముగియాల్సి ఉంది. కానీ, కేసులు ఏమాత్రం తగ్గుముఖం పట్టకపోవడంతో లాక్‌డౌన్‌ను పొడిగించాలని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ నిర్ణయించారు. అలాగే మేలో అందిస్తున్నట్లుగా జూన్‌లోనూ ఉచిత ఆహార కిట్లు అందజేస్తామని సీఎం హామీ ఇచ్చారు. మే నెలలో వెల్ఫేర్‌ పెన్షన్స్‌ కింద రూ.823.23 కోట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. అలాగే వేల్ఫేర్ బోర్డులలో ఉన్న ప్రతి ఒక్కరికీ రూ.1000 ఆర్థిక సాయం ప్రకటించారు.

More Telugu News