AP CID: ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టును ధ్రువీకరించిన సీఐడీ

  • ఈ సాయంత్రం హైదరాబాదులో రఘురామ అరెస్ట్
  • మంగళగిరికి తరలింపు
  • సీఐడీ అదనపు డీజీపీ సునీల్ కుమార్ పేరిట ప్రకటన
  • ఇప్పటికే ప్రాథమిక విచారణ పూర్తయిందని వెల్లడి
  • ఉద్రిక్తతలు రెచ్చగొడుతున్నారని అభియోగం
AP CID confirms Raghurama Krishna Raju arrest

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును తీవ్ర ఉద్రిక్తతల మధ్య ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేయడం తెలిసిందే. ఈ అరెస్టును ఏపీ సీఐడీ ధ్రువీకరించింది. ఈ మేరకు ఏపీ సీఐడీ అదనపు డీజీపీ సునీల్ కుమార్ పేరిట ప్రకటన వెలువడింది. ఉద్రిక్తతలను రెచ్చగొట్టేలా మాట్లాడారని, సామాజిక వర్గాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని ఎంపీ రఘురామకృష్ణరాజుపై అభియోగాలు మోపినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అనుచిత వ్యాఖ్యలతో ప్రభుత్వ ప్రతిష్ఠను దిగజార్చారని ఆరోపించారు. ఎంపీ రఘురామకృష్ణరాజుపై ఇప్పటికే ప్రాథమిక విచారణ పూర్తి చేశామని ఏపీ సీఐడీ వెల్లడించింది.

More Telugu News