Chiranjeevi: ప్లీజ్ నిర్లక్ష్యంగా ఉండొద్దు.. గుండె తరుక్కుపోతోంది: చిరంజీవి

  • కరోనా వచ్చినా భయపడొద్దు
  • వీలైతే అందరూ డబుల్ మాస్కులు ధరించండి
  • వైరస్ కంటే భయమే మనల్ని ఎక్కువగా చంపేస్తుంది
Dont neglect Corona says Chiranjeevi

ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది కరోనాతో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ సినీ నటుడు చిరంజీవి స్పందిస్తూ... కరోనా వల్ల మన ఆత్మీయులను కోల్పోవడం చాలా బాధాకరంగా ఉందని... గుండె తరుక్కుపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పని పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించారని... అందరూ ఇప్పటికైనా అన్ని జాగ్రత్తలు పాటించాలని కోరారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని... వీలైతే డబుల్ మాస్కులు ధరించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని కోరారు.

కరోనా పాజిటివ్ వచ్చినా భయపడాల్సిన పని లేదని చిరంజీవి అన్నారు. వైరస్ కంటే భయమే మనల్ని ఎక్కువగా చంపేస్తుందని చెప్పారు. ఒంట్లో నలతగా అనిపించినా... ఊపిరి ఇబ్బంది అనిపించినా వెంటనే డాక్టర్లను సంప్రదించాలని సూచించారు. కరోనా నుంచి కోలుకున్న వారిలో యాంటీ బాడీస్ ఉత్పత్తి అవుతాయని... వారు ప్లాస్మా డొనేట్ చేస్తే కనీసం ఇద్దరి ప్రాణాలు కాపాడినవారు అవుతారని చెప్పారు.

More Telugu News