Nara Lokesh: ప్రజలు మీ నుంచి వ్యాక్సిన్లు కోరుతున్నారు... కుట్రలు కాదు: సీఎం జగన్ కు నారా లోకేశ్ లేఖాస్త్రం

  • ఏపీలో వ్యాక్సిన్ ప్రక్రియపై లోకేశ్ స్పందన
  • ఇప్పటికైనా సీఎం జగన్ స్పందించాలని లేఖ
  • ప్రజల ప్రాణాలు కాపాడాలని హితవు
  • ఇతర రాష్ట్రాలు వ్యాక్సిన్లకు ఆర్డర్ ఇచ్చాయని వెల్లడి
  • జగన్ ఎందుకు కేంద్రాన్ని అడగలేకపోతున్నాడని వ్యాఖ్యలు
Lokesh wrote CM Jagan and ask give vaccine to people

ఏపీలో కరోనా వ్యాక్సినేషన్ నిదానించడం పట్ల టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ సీఎం జగన్ కు లేఖ రాశారు. వ్యాక్సిన్ పై ప్రభుత్వ నిర్లక్ష్యం ఖరీదు ప్రజల ప్రాణాలు అని వెల్లడించారు. ఇప్పటికైనా స్పందించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని సీఎం జగన్ కు లేఖ రాసినట్టు తెలిపారు. కరోనా మరణాల సంఖ్య 9 వేలు దాటుతున్న వేళ, ప్రాణాలు నిలిపే వ్యాక్సిన్ల కోసం సీఎం జగన్ కేంద్రాన్ని డిమాండ్ చేయలేకపోవడం విచారకరం అని పేర్కొన్నారు.

వ్యాక్సిన్ తయారీదారుల నుంచి నేరుగా డోసులు సేకరించేందుకు ఏప్రిల్ 20 నుంచి 29వ తేదీ మధ్యన మన రాష్ట్రానికి అవకాశం వచ్చినా స్పందించలేదని లోకేశ్ ఆరోపించారు. అదే సమయంలో రాజస్థాన్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలు ఒక్కొక్కటి 3 కోట్ల వ్యాక్సిన్ డోసులకు పైగా ఆర్డర్లు చేశాయని వెల్లడించారు.

"రాష్ట్ర ప్రజలు మీ నుంచి వ్యాక్సిన్లు కోరుకుంటున్నారు... కుట్రలు కాదు. మేం మీ నుంచి సమాధానాలు కోరుకుంటున్నాం... ప్రకటనలు కాదు. మేం మీ మంత్రుల నుంచి చర్యలను కోరుతున్నాం... వాక్చాతుర్యం, సహజీవనం కాదు. మీరు పరిస్థితులకు తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవాలని మేం కోరుకుంటున్నాం... కుంటిసాకులు చెప్పడంకాదు" అని పేర్కొన్నారు.

ఏపీలోని ప్రతి పౌరుడికి టీకా ఇవ్వడంలో ప్రభుత్వ కార్యాచరణ ప్రణాళికపై సమగ్ర శ్వేతపత్రం విడుదల చేయాలని కోరుతున్నామని లోకేశ్ స్పష్టం చేశారు.

More Telugu News