India: గత 24 గంటల్లో మన దేశంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 3.43 లక్షలు

More than 3 Lakh Fresh Corona cases in India
  • గత 24 గంటల్లో 3.43 లక్షల మందికి కరోనా పాజిటివ్
  • ఇదే సమయంలో 4 వేల మంది మృతి
  • ఇప్పటి వరకు కరోనా బారిన పడిన 2.5 కోట్ల మంది ప్రజలు
మన దేశంలో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో 3.43 లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో దాదాపు 4 వేల మంది మృతి చెందారు. 3,44,776 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

ఇక దేశంలో నమోదైన మొత్తం కేసుల్లో 79.04 శాతం కేసులు కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పశ్చిమబెంగాల్, గుజరాత్, చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, హర్యానా రాష్ట్రల్లో నమోదు కావడం గమనార్హం.

ప్రస్తుతం దేశంలో 37,04,893 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 17,92,98,584 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. మన దేశంలో ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య రెండున్నర కోట్లకు చేరువవుతోంది. మొత్తం 2,40,46,809 మంది కరోనా బారిన పడ్డారు.
India
Corona Cases

More Telugu News