UK: నా తండ్రి చేసిన తప్పు.. నేనూ చేయకూడదనే...: రాజకుటుంబంపై ప్రిన్స్​ హ్యారీ సంచలన వ్యాఖ్యలు

Prince Harry Says Moved To US To Break Cycle Of Family Pain And Suffering
  • బాధల బంధనాలను తెంచుకునేందుకే దూరంగా వచ్చేశాం
  • తన పెంపకంలో తన తండ్రి ఎన్నో బాధలు పడ్డారని కామెంట్
  • రాచబిడ్డలా పెంచేందుకు ఎన్ని కష్టాలు పడ్డారోనని ఆవేదన
  • తన పిల్లల విషయంలో అది జరగకూడదనే ఈ నిర్ణయమని వెల్లడి
కుటుంబంపై బ్రిటన్ యువరాజు హ్యారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాధలు, బంధనాల నుంచి విముక్తి పొందేందుకే కుటుంబం అనే సంకెళ్లు తెంచుకుని అమెరికాకు వెళ్లామని ఆయన చెప్పారు. తన తండ్రి ప్రిన్స్ చార్లెస్ పడిన బాధలే తానూ పడ్డానని చెప్పుకొచ్చారు. గురువారం ‘ఆర్మ్ చెయిర్ ఎక్స్ పర్ట్’ పాడ్ క్యాస్ట్ ఇంటర్వ్యూలో ఆయన తన వ్యక్తిగత జీవితంలోని పలు విషయాలను పంచుకున్నారు.

ఈ విషయంలో తన తండ్రిని నిందించదలచుకోలేదని హ్యారీ చెప్పారు. అయితే, తన పిల్లల విషయంలో మాత్రం తన తండ్రి చేసిన తప్పే చేయకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నానని వివరించారు. తన పిల్లల పెంపకం విషయంలో తాను చాలా ఆవేదనకు గురయ్యానన్నారు. రాజకుటుంబంలో ఇలాంటి బాధలే తన తల్లిదండ్రులూ పడి ఉండొచ్చన్నారు. కాబట్టి ఆ బాధల బంధనాలను తెంచుకోవాలన్న నిర్ణయానికి వచ్చానని తెలిపారు.

తమ పెంపకం విషయంలో తన తండ్రి ఎన్ని కష్టాలు పడ్డాడో, రాచబిడ్డల్లా తమను పెంచేందుకు ఎంత ఆవేదన అనుభవించారో ఇప్పుడు అర్థమవుతోందన్నారు. ఇలాంటి పెంపకాన్ని తన పిల్లలకు ఇవ్వకూడదన్న ఉద్దేశంతోనే భార్యాపిల్లలతో అమెరికాకు వచ్చేశానని ఆయన వివరించారు. ప్రస్తుతం మేఘన్ తో కలిసి ఆయన లాస్ఏంజిలిస్ కు సమీపంలోని మోంటేసిటోలో నివసిస్తున్నారు.
UK
Prine Harry
Meghan Markle
Prince Charles

More Telugu News