Tollywood: టాలీవుడ్ లో మరో విషాదం.. కరోనాతో డైరెక్టర్ నంద్యాల రవి మృతి 

Tollywood director Nandyala Ravi dies with Corona
  • కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడిన రవి
  • ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
  • పలు చిత్రాలకు రచయితగా కూడా పని చేసిన రవి
టాలీవుడ్ ను కరోనా మహమ్మారి శోకసంద్రంలో ముంచుతోంది. కరోనా బారిన పడి ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు మృతి చెందిన సంగతి తెలిసిందే. తాజాగా రచయిత, దర్శకుడు నంద్యాల రవి కరోనా కారణంగా ఈరోజు కన్నుమూశారు. కొన్ని రోజుల క్రితం ఆయన కరోనా బారిన పడ్డారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న ఆయన హాస్పిటల్ బిల్లు కూడా చెల్లించలేని స్థితిలో ఉంటే... సినీ నటుడు సప్తగిరి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించారు. చివరకు ఆరోగ్య పరిస్థితి విషమించి కన్నుమూశారు.

పలు చిత్రాలకు నంద్యాల రవి రచయితగా పని చేశారు. 'లక్ష్మీ రావే మా ఇంటికి' అనే సినిమాను డైరెక్ట్ చేశారు. సప్తగిరితో ఓ సినిమాను చేసేందుకు కూడా కథను రెడీ చేసుకున్నారు. ఇంతలోనే కరోనా మహమ్మారి ఆయనను బలితీసుకుంది. నంద్యాల రవి మృతిపై సినీ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు.
Tollywood
Nandyala Ravi
Corona Virus
Director

More Telugu News