ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 25 లక్షల విరాళమిచ్చిన ఏఆర్ మురుగదాస్

14-05-2021 Fri 11:35
  • కొవిడ్ బాధితులను ఆదుకునేందుకు ముందుకొస్తున్న సినీ ప్రముఖులు
  • సీఎంను కలిసి చెక్ అందించిన దర్శకుడు
  • సూర్య, కార్తి కలిసి కోటి రూపాయల అందజేత
AR Murugadoss donates Rs 25 lakh to  Chief Ministers Relief Fund

కోలీవుడ్‌కు చెందిన ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 25 లక్షల విరాళం ప్రకటించారు. సీఎం ఎంకే స్టాలిన్‌ను కలిసి చెక్ అందించారు. కరోనా కట్టడికి ఆయా ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాయి. పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ కూడా అమల్లో ఉండగా, మరికొన్ని చోట్ల కఠిన ఆంక్షలు అమలవుతున్నాయి.

మరోవైపు, ఆక్సిజన్, మందులు, బెడ్‌ల కొరత వేధిస్తోంది. దీంతో పలువురు సినీ ప్రముఖులు ముందుకొచ్చి తమకు చేతనైనంత సాయం అందిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా దర్శకుడు మురుగదాస్ తన వంతు ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ప్రముఖ నటుడు సూర్య, ఆయన సోదరుడు కార్తి కలసి సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇప్పటికే కోటి రూపాయల విరాళం అందించారు.