Vizag: విశాఖలో 300 పడకల ఆక్సిజన్ కోవిడ్ కేర్ సెంటర్ ను ప్రారంభించిన ఆళ్ల నాని

  • ప్రగతి భారత్ ఆధ్వర్యంలో సెంటర్ ప్రారంభం
  • కార్యక్రమానికి హాజరైన మంత్రులు, విజయసాయిరెడ్డి
  • విశాఖ జిల్లాలో భారీగా నమోదవుతున్న కేసులు
300 beds covid care center started in Vizag

విశాఖ జిల్లాలో కరోనా కేసులు అత్యధిక సంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో, పేషంట్లకు అవసరమైన చికిత్స, వసతులను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటోంది. ప్రైవేటు సంస్థలు, స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా తమ వంతు కృషి చేస్తున్నాయి.

ఈ క్రమంలో ఈరోజు విశాఖలోని షీలానగర్ లో 300 పడకల ఆక్సిజన్ కోవిడ్ కేర్ సెంటర్ ప్రారంభమైంది. ప్రగతి భారతి ఆధ్వర్యంలో ఈ సెంటర్ ను ఏర్పాటు చేశారు. ఈ సెంటర్ ను ఆరోగ్య మంత్రి ఆళ్ల నాని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు కన్నబాబు, అవంతి శ్రీనివాస్, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ కోవిడ్ కేర్ సెంటర్ తో ఉత్తరాంధ్ర ప్రజలకు ఎంతో మేలు జరగనుంది.

More Telugu News