Allu Arjun: 'పుష్ప' ఐటమ్ కోసం పూజ హెగ్డే లేదా దిశా పటాని!

Pooja Hegde and Disha Patani for Pushpa movie item song
  • రెండు భాగాలుగా రానున్న 'పుష్ప'
  • రెండవ భాగంలోనే ఐటమ్ సాంగ్
  • ఊర్వశీ రౌతేలకి ఛాన్స్ లేనట్టే
అల్లు అర్జున్ .. సుకుమార్ కాంబినేషన్లో 'పుష్ప' రూపొందుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో, కథానాయికగా రష్మిక కనువిందు చేయనుంది. ఫహాద్ ఫాజిల్ ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయాలనే నిర్ణయాన్ని రీసెంట్ గా తీసుకున్నారు. దసరాకి ఒక భాగం .. వచ్చే ఏడాదిలో మరొక భాగాన్ని విడుదల చేయనున్నారు.

సాధారణంగా సుకుమార్ - దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ అనగానే అదిరిపోయే ఐటమ్ సాంగ్ ఒకటి ఉంటుంది. అలాగే 'పుష్ప' సినిమా కోసం కూడా ఒక ఐటమ్ సాంగ్ ను ప్లాన్ చేశారు. ఈ ఐటమ్ సాంగ్ ను ఊర్వశీ రౌతేలాతో చేయించనున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ పూజ హెగ్డే - దిశా పటాని పేర్లను పరిశీలిస్తున్నట్టుగా నిర్మాత చెప్పారు. రెండవ భాగంలోనే ఐటమ్ సాంగ్ ఉంటుందని అన్నారు. ఇద్దరూ నాజూకు భామలే .. కుర్రాళ్ల కలల రాణులే. మరి వీరిలో ఎవరు సెట్ అవుతారనేది చూడాలి.
Allu Arjun
Pooja Hegde
Disha Patani

More Telugu News