ఇద్దరు యాక్షన్ హీరోలతో మల్టీస్టారర్!

14-05-2021 Fri 10:25
  • యాక్షన్ హీరోగా రాజశేఖర్ కి క్రేజ్
  • మాస్ ఆడియన్స్ లో గోపీచంద్ కి మంచి పేరు
  • ఇద్దరినీ కలుపుతున్న శ్రీవాస్
  • శ్రీవాస్ ఖాతలో 'లక్ష్యం' .. 'లౌక్యం' హిట్లు    
Rajasekhar and Gopichand as lead roles in multistarrer movie

రాజశేఖర్ అంటే ఆవేశం .. అందువలన కెరియర్ తొలినాళ్లలో ఆయన యాక్షన్ సినిమాలను ఎక్కువగా చేసుకుంటూ వచ్చారు. యాక్షన్ సినిమాలే ఆయనకి యాంగ్రీ యంగ్ మెన్ ఇమేజ్ ను తెచ్చిపెట్టాయి. ఇక గోపీచంద్ హీమాన్ పర్సనాలిటీతో యాక్షన్ హీరోగా ఎక్కువ మార్కులు కొట్టేశాడు. గోపీచంద్ కి మాస్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. ఈ ఇద్దరు హీరోలు కూడా ఇంతవరకూ మల్టీ స్టారర్ సినిమాలు చేయలేదనే చెప్పాలి. అలాంటి ఈ హీరోలిద్దరితో ఒక మల్టీ స్టారర్ రూపొందనుందనే టాక్ జోరుగా వినిపిస్తోంది.

కొంతకాలంగా దర్శకుడు శ్రీవాస్ ఒక మల్టీ స్టారర్ కథపై కసరత్తు చేస్తూ వచ్చాడట. ఆ కథకు రాజశేఖర్ - గోపీచంద్ అయితే బాగుంటారనే ఉద్దేశంతో వాళ్లకి వినిపించాడట. కథ నచ్చడంతో ఇద్దరూ ఓకే అనేశారని తెలుస్తోంది. ఓ పారిశ్రామికవేత్త నిర్మిస్తున్న ఈ సినిమాకి సంబంధించి, ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయని కూడా అంటున్నారు. గతంలో గోపీచంద్ తో శ్రీవాస్ చేసిన 'లక్ష్యం' .. 'లౌక్యం' సినిమాలు హిట్ కొట్టాయి. ప్రస్తుతం రాజశేఖర్ - గోపీచంద్ చేస్తున్న సినిమాలు పూర్తికాగానే, ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని చెబుతున్నారు.