కోలుకుంటున్నా.. ఆరోగ్యవంతుడిగా మీ ముందుకు వస్తా: జూనియర్ ఎన్టీఆర్

14-05-2021 Fri 10:22
  • ఈ నెల 10న కరోనా బారిన పడిన తారక్
  • ఇంటిలోనే ఐసోలేషన్లో వుండి చికిత్స 
  • తన ఆరోగ్యం మెరుగవుతోందని వెల్లడి
I am getting better says Junior NTR

కరోనా వైరస్ నుంచి కోలుకుంటున్నానని సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ చెప్పారు. ఈరోజు రంజాన్ సందర్భంగా ప్రతి ఒక్కరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం తన ఆరోగ్యం మెరుగవుతోందని... త్వరలోనే నెగెటివ్ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తన ఆరోగ్యం మెరుగుపడాలని ప్రార్థించిన అందరికీ ధన్యవాదాలు చెపుతున్నానని అన్నారు. ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండాలని, అన్ని జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. ఈ మేరకు తారక్ ట్వీట్ చేశారు.

ఈ నెల 10న తారక్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తనకు కరోనా సోకినట్టు తెలిసిన వెంటనే ఆయన హోమ్ ఐసొలేషన్ లోకి వెళ్లిపోయారు. వైద్యుల సూచనలను పాటిస్తూ, ఇంటి వద్దే చికిత్స పొందుతున్నారు. తారక్ త్వరగా కోలుకోవాలంటూ చంద్రబాబు, చిరంజీవి, నారా లోకేశ్, మహేశ్ బాబు వంటి ప్రముఖులు ఆకాంక్షించారు.