థియేటర్లకే రానున్న 'విరాటపర్వం'

14-05-2021 Fri 09:54
  • నక్సలైట్ల అజ్ఞాతవాసం 'విరాటపర్వం'
  • కరోనా కారణంగా విడుదల వాయిదా
  • ఓటీటీ రిలీజ్ వార్తల్లో నిజం లేదన్న మేకర్స్
  • త్వరలోనే విడుదల తేదీ ప్రకటన  
Virata Parvam movie will release in theatres

రానా కథానాయకుడిగా వేణు ఊడుగుల దర్శకత్వంలో 'విరాటపర్వం' సినిమా రూపొందింది. 1990 నాటి నేపథ్యంలోని నక్సలైట్ల జీవన విధానం .. ఆశయ సాధనలో వాళ్లు ఎదుర్కున్న ఇబ్బందులను .. అలాగే కుటుంబ జీవనానికి దూరమైన వాళ్లలో కలిగే ఎమోషన్స్ ప్రధానంగా ఈ కథ నడుస్తుంది. ఈ సినిమాలో సాయిపల్లవి పాత్ర అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. సురేశ్ ప్రొడక్షన్స్ వారు నిర్మించిన ఈ సినిమాను, ఏప్రిల్ 30వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా కారణంగా వాయిదా వేశారు.

అయితే థియేటర్లు తెరుచుకునేంతవరకూ ఈ సినిమాను వెయిటింగులో పెట్టే పరిస్థితులు కనిపించడం లేదనీ, ఓటీటీలో విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయనే టాక్ వచ్చింది. త్వరలోనే ఈ విషయమై సురేశ్ బాబు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్పుకున్నారు.

కానీ ఈ వార్తలో నిజం లేదనే విషయాన్ని మేకర్స్ స్పష్టం చేశారు. ఈ సినిమా థియేట్రికల్ హక్కులను ఎప్పుడో విక్రయించేశారట. అలాగే శాటిలైట్ .. డిజిటల్ .. డబ్బింగ్ హక్కులను కూడా అమ్మేశారట. అందువలన ఈ సినిమా కచ్చితంగా థియేటర్లకే వస్తుందనే విషయాన్ని స్పష్టం చేశారు. త్వరలోనే విడుదల తేదీని ప్ర్రకటిస్తామని అన్నారు.