టీకా లేకున్నా ఆ కాలర్ ట్యూన్‌తో వేధింపులేంటి?: ఢిల్లీ హైకోర్టు మండిపాటు

14-05-2021 Fri 07:52
  • టీకాలు సరిపడా లేవు కానీ టీకా వేయించుకోమని చెబుతారా?
  • చూస్తుంటే ఇంకో పదేళ్లు ఇది కొనసాగేలా ఉంది
  • ఇంకేదైనా కొత్తగా ట్రై చేయండి
Irritating message on vaccination when there are no doses

ఫోన్ చేయగానే తొలుత వినిపించే కరోనా కాలర్ ట్యూన్‌పై ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశంలో సరిపడా వ్యాక్సిన్లు లేకున్నా ఫోన్ చేసినప్పుడల్లా చిరాకుపరిచే ఆ కాలర్ ట్యూన్‌తో విసిగిస్తున్నారంటూ తీవ్రంగా మండిపడింది. టీకాలు లేకున్నా తప్పకుండా టీకాలు వేసుకోమంటూ ఆ కాలర్ ట్యూన్ ద్వారా చెబుతున్నారని, వారికి టీకా ఎలా అందుతుందని, ఎవరు వేస్తారని కేంద్రాన్ని ప్రశ్నించింది.

అసలు ఈ సందేశం ఉద్దేశం ఏమిటని నిలదీసింది. ప్రతి ఒక్కరికీ టీకా అందించాలి. చూస్తుంటే ఈ కాలర్ ట్యూన్ ఇంకో పదేళ్లు కొనసాగేలా కనిపిస్తోందని అభిప్రాయపడింది. ఇంకేదైనా కొత్తది వింటే కొంత ఉపయోగకరంగా ఉంటుందని, ఒకవేళ డబ్బులు తీసుకున్నా పరవాలేదు కానీ అందరికీ అయితే టీకా ఇవ్వాలని జస్టిస్ విపిన్ సంఘి, రేఖా పల్లితో కూడిన ధర్మాసనం పేర్కొంది.