సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

14-05-2021 Fri 07:30
  • 'రా' ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న రెజీనా 
  • షాంఘై చిత్రోత్సవానికి సూర్య సినిమా
  • 'ఏక్ మినీ కథ'కు ఓటీటీ నుంచి బిగ్ ఆఫర్  
Regina plays RAA officer in Tamil movie

*  కథానాయిక రెజీనా తమిళంలో తాజాగా 'బోర్డర్' అనే సినిమాలో నటిస్తోంది. అరుణ్ విజయ్ హీరోగా అరివళగన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రెజీనా 'రా' ఆఫీసర్ గా వైవిధ్యమైన పాత్రలో నటిస్తోంది.
*  సూర్య కథానాయకుడుగా సుధ కొంగర దర్శకత్వంలో వచ్చిన 'ఆకాశం నీ హద్దురా' చిత్రానికి విమర్శకుల నుంచి కూడా మంచి ప్రశంసలు లభించిన సంగతి విదితమే. ఇప్పుడీ చిత్రం షాంఘై అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో పనోరమా విభాగంలో ప్రదర్శనకు ఎంపికైంది. దక్షిణాది నుంచి ఈ ఒక్క చిత్రమే దీనికి ఎంపికవడం విశేషం.  
*  సంతోష్ శోభన్ హీరోగా కార్తీక్ రాపోలు దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ నిర్మించిన 'ఏక్ మినీ కథ' చిత్రం ఎకాఎకీన ఓటీటీ ద్వారా విడుదల కానుంది. ఈ చిత్రం స్ట్రీమింగ్ హక్కులను ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ 9 కోట్ల మొత్తానికి దక్కించుకున్నట్టు తెలుస్తోంది.