Cricket: కోహ్లీ నా నుంచి ఒక విషయం నేర్చుకోవాలి: శుభ్‌మన్ గిల్‌

  • భారత జట్టు అత్యుత్తమ యువ ఆటగాళ్లలో గిల్‌ ఒకడు
  • కోహ్లీ సారథ్యంలో భారత జట్టులోకి ప్రవేశం
  • ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు
  • హర్భజన్‌ బట్టర్‌ చికెన్‌ చేసి పెట్టాడని వెల్లడి
  • ఇంగ్లాండ్‌ టూర్‌కు ఎంపికైన గిల్‌
Kohli must learn onething from me says shubhman gill

భారత్‌ క్రికెట్‌ జట్టుకు దొరికిన అత్యుత్తమ యువ ఆటగాళల్లో శుభ్‌మన్ గిల్‌ ఒకడు. కోహ్లీ నాయకత్వంలో భారత జట్టులోకి ప్రవేశించిన ఆటగాళ్లలో అతనొకడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో పటిష్ఠమైన ప్రదర్శన కనబరిచి జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. కోహ్లీ నుంచి తాను చాలా నేర్చుకున్నానని గిల్‌ పలు సందర్భాల్లో తెలిపారు.

తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గిల్‌ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. కోహ్లీ తన నుంచి ఒక అంశం నేర్చుకోవాల్సి ఉందన్నాడు. అదే ఫిఫా గేమ్‌ అని తెలిపాడు. ఈ ఆటలో కోహ్లీ తన చేతిలో ఎప్పుడూ ఓడిపోతాడన్నాడు. ఒకవేళ కాలం వెనక్కి వెళితే తాను 2011 ప్రపంచ కప్‌లో ఆడేందుకు ఇష్టపడతానని పేర్కొన్నాడు. ఇక తన కోసం ఓసారి హర్భజన్‌ సింగ్‌ బట్టర్‌ చికెన్‌ చేసి పెట్టాడని తెలిపాడు.

జూన్‌ 2న ఇంగ్లాండ్‌కు బయలుదేరనున్న భారత జట్టులో గిల్‌ స్థానం సంపాదించుకున్నాడు. ఈ జట్టు న్యూజిలాండ్‌తో డబ్ల్యూటీసీ ఫైనల్‌తో పాటు ఇంగ్లాండ్‌తో జరగాల్సిన ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ ఆడాల్సి ఉంది.

More Telugu News