భారత మహిళల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా రమేశ్ పొవార్
- ప్రకటించిన బీసీసీఐ
- మొత్తం 35 మంది పోటీ
- పొవార్ వైపే మొగ్గుచూపిన అడ్వైజరీ కమిటీ
- రెండోసారి బాధ్యతలు చేపట్టనున్న పొవార్
ఈ పదవి కోసం మొత్తం 35 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరందరినీ ముగ్గురు సభ్యులతో కూడిన క్రికెట్ అడ్వైజరీ కమిటీ ఇంటర్వ్యూ చేసింది. కమిటీ మొత్తం ఏకగ్రీవంగా పొవార్ వైపే మొగ్గుచూపినట్లు సమాచారం. 2018లో జులై-నవంబర్ మధ్య కోచ్‌గా కొనసాగిన పొవార్.. జట్టులో సీనియర్ ప్లేయర్ మిథాలీ రాజ్‌తో విభేదాలు ఏర్పడిన నేపథ్యంలో వేటుకు గురయ్యారు. కెరీర్లో 2 టెస్టులు ఆడిన పొవార్ 6 వికెట్లు తీశాడు. 31 వన్డేల్లో 34 వికెట్లు పడగొట్టాడు. ఇటీవల విజయ్ హజారే ట్రోఫీ గెలుచుకున్న ముంబయి జట్టుకు కోచ్‌గానూ వ్యవహరించారు.