త్రివిక్రమ్ ... మహేశ్ మూవీలో శిల్పా శెట్టి?

13-05-2021 Thu 18:27
  • త్రివిక్రమ్ నెక్స్ట్ మూవీకి సన్నాహాలు
  • మహేశ్ బాబు జోడీగా పూజ హెగ్డే
  • కీలకమైన పాత్ర కోసం శిల్పా శెట్టి పేరు
  • త్వరలోనే సెట్స్ పైకి  
Shilpa Shetty in Trivikram movie

త్రివిక్రమ్ సినిమాలను ఇష్టపడే వాళ్లంతా ఆయన తదుపరి సినిమాను గురించి ఎదురు చూస్తున్నారు. ఆయన తన నెక్స్ట్ సినిమాను మహేశ్ బాబుతో చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా పూజ హెగ్డే పేరు వినిపిస్తోంది. ఇక ఒక కీలకమైన పాత్ర కోసం బాలీవుడ్ నటి శిల్పా శెట్టి పేరును పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. కథను ఒక అనూహ్యమైన మలుపు తిప్పే ఈ పాత్ర కోసం సీనియర్ స్టార్ హీరోయిన్ ను తీసుకోవాలని భావించి, శిల్పా శెట్టి అయితే బాగుంటుందనే ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది.

త్రివిక్రమ్ తన సినిమాల్లో కీలకమైన పాత్రలకు సీనియర్ స్టార్ హీరోయిన్లను తీసుకుంటూ ఉంటాడు. అలా ఆయన సినిమాల్లో నదియా .. ఖుష్బూ .. దేవయాని .. టబూ  .. స్నేహా కనిపించారు. ఈ సారి శిల్పా శెట్టిని రంగంలోకి దింపనున్నట్టుగా చెప్పుకుంటున్నారు. తెలుగులో హీరోయిన్ గా కొన్ని సినిమాల్లో అలరించిన శిల్పా శెట్టి, ఆ తరువాత బాలీవుడ్ సినిమాలకే పరిమితమైంది. త్రివిక్రమ్ సినిమాతో మళ్లీ ఇంతకాలానికి ఆమె తెలుగులోకి రీ ఎంట్రీ ఇవ్వనుందనే వార్తలో వాస్తవమెంతన్నది చూడాలి మరి.