66 ఏళ్ల వయసులో 17వ పెళ్లికి సిద్ధం... ఇప్పటికే 151 మంది సంతానం!

13-05-2021 Thu 18:14
  • 16 మందిని పెళ్లాడిన జింబాబ్వే వ్యక్తి
  • మరో పెళ్లి చేసుకుంటానని వెల్లడి
  • ఏ భార్య రుచిగా వండితే ఆమె వద్దే భోజనం
  • 1000 మంది పిల్లలను కనాలని లక్ష్యం
  • చచ్చేలోపు లక్ష్యాన్ని సాధిస్తానని ధీమా
Zimbabwe man set to get another wife

ఆఫ్రికా దేశం జింబాబ్వేలో ఓ వ్యక్తి ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నాడో తెలిస్తే మతిపోతుంది. జింబాబ్వే మాజీ సైనికుడు మిషెక్ న్యాండోరో ఇప్పటివరకు 16 పెళ్లిళ్లు చేసుకుని, ఏకంగా 151 మంది సంతానాన్ని కన్నాడు. ఇప్పుడు మరో పెళ్లికి సిద్ధమవుతున్నాడు. మిషెక్ వయసు ప్రస్తుతం 66 సంవత్సరాలు. 16 మంది భార్యలు, 151 మంది పిల్లలతో కుటుంబ పోషణ ఎలా జరుగుతోందన్న సందేహాలకు మిషెక్ ఇలా బదులిచ్చాడు....

"నా కుటుంబంలో పెద్ద పిల్లలు సంపాదిస్తున్నారు. వాళ్ల సంపాదనతో జీవితం సాఫీగా సాగిపోతోంది. భార్యలతో హాయిగా జీవించడమే నా పని. 1000 మంది పిల్లలను కనడం నా లక్ష్యం. చచ్చేలోపు అది సాధిస్తా.  ఏ భార్య బాగా రుచిగా వండితే ఆరోజుకు ఆమె వద్దే నా భోజనం. త్వరలోనే 17వ పెళ్లి చేసుకోబోతున్నాను. నేను ఇప్పటివరకు చేసుకున్న అన్ని పెళ్లిళ్లు భార్యలకు చెప్పిన తర్వాతే చేసుకున్నాను. వారి అంగీకారంతోనే ఇన్ని పెళ్లిళ్లు జరిగాయి" అని వివరించాడు.