సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష వాయిదా
- స్వైరవిహారం చేస్తున్న కరోనా
- జూన్ 27న జరగాల్సిన ప్రిలిమ్స్
- ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలు జరపలేమన్న యూపీఎస్సీ
- అక్టోబరు 10కి వాయిదా
కరోనా విసృతంగా వ్యాపిస్తున్న ప్రస్తుత సమయంలో పరీక్షలు జరుపలేమని యూపీఎస్సీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ ప్రిలిమ్స్ పరీక్షలను అక్టోబరు 10న జరిపేందుకు రీషెడ్యూల్ చేసినట్టు తెలిపింది. కరోనా విజృంభణ నేపథ్యంలో దేశంలో ఇప్పటికే పలు కీలక పరీక్షలు వాయిదా పడడం తెలిసిందే.