పాల వ్యాపారం చేసేవాడివి ఇంత పెద్దోడివి ఎలా అయ్యావ్? నిన్ను వదిలి పెట్టం: మంత్రి మల్లారెడ్డికి ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడి వార్నింగ్
- మల్లారెడ్డి ఆసుపత్రి కట్టిన స్థలం ఆయనది కాదు
- ప్రభుత్వ స్థలంలో ఆసుపత్రి కట్టారు
- ఆయన అక్రమ నిర్మాణాల భాగోతాలను బయటపెడతాం
మల్లారెడ్డి ఆసుపత్రి కట్టిన స్థలం ఆయనది కాదని... అది ప్రభుత్వ భూమి అని వెంకట్ అన్నారు. తాను కూడా ఎంబీబీఎస్ విద్యార్థినేనని... డాక్టర్లపై తామెందుకు దాడి చేస్తామని ప్రశ్నించారు. డాక్టర్లపై దాడి చేశామని చెబుతున్నవారు దానికి సంబంధించిన వీడియోలను ఎందుకు విడుదల చేయడం లేదని నిలదీశారు. కరోనా వైద్యాన్ని తక్షణమే ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు. మల్లారెడ్డి తమపై పెట్టిన అక్రమ కేసులకు తాము భయపడబోమని అన్నారు. ఆయన అక్రమ నిర్మాణాల భాగోతాలను బయటపెడతామని... ఆయనను వదిలే ప్రసక్తే లేదని చెప్పారు.