vaccine: కొవిషీల్డ్ వ్యాక్సిన్ డోసుల మ‌ధ్య వ్య‌వ‌ధి 12-16 వారాల‌కు పెంపు.. క‌రోనా నుంచి కోలుకున్న 6 నెల‌ల తర్వాతే వ్యాక్సిన్: కేంద్రం నిర్ణయాలు

  • గ‌ర్భిణుల‌కు ఏ వ్యాక్సిన్ అయినా ఇవ్వ‌వ‌చ్చు
  • ప్ర‌స్తుతం కొవిషీల్డ్ వ్య‌వ‌ధి 6 నుంచి 8 వారాలు
  • కొవాగ్జిన్ డోసుల మ‌ధ్య వ్య‌వ‌ధిని యథావిధిగా ఉంచాలి
changes in vaccination program

దేశ వ్యాప్తంగా క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతోన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వానికి, ప్ర‌జ‌ల‌కు టీకాల‌పై జాతీయ ఇమ్యునైజేష‌న్ సాంకేతిక స‌ల‌హా బృందం కీల‌క సూచ‌న‌లు చేసింది. క‌రోనాకు గురై, దాని నుంచి కోలుకున్న వారు ఆరు నెల‌ల అనంత‌రం వ్యాక్సిన్ తీసుకోవాలని పేర్కొంది. దీనికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

గ‌ర్భిణుల‌కు ఏ వ్యాక్సిన్ అయినా ఇవ్వ‌వ‌చ్చని వివ‌రించింది. అలాగే, ప్ర‌స‌వం అనంత‌రం ఎప్పుడైనా వ్యాక్సిన్ వేయించుకోవ‌చ్చని తెలిపింది. కొవిషీల్డ్ వ్యాక్సిన్ డోసుల మ‌ధ్య వ్య‌వ‌ధి పెంచాలని కీల‌క సూచన చేసింది. ప్ర‌స్తుతం కొవిషీల్డ్ మొద‌టి, రెండో డోసుల మ‌ధ్య‌ వ్య‌వ‌ధి 6 నుంచి 8 వారాలుగా ఉంది. దాన్ని 12-16 వారాల‌కు పెంచాలని సూచించింది. కొవాగ్జిన్ మొద‌టి- రెండో డోసుల మ‌ధ్య వ్య‌వ‌ధిని మాత్రం యథావిధిగా ఉంచాలని తెలిపింది.

More Telugu News