వెయిటింగులో పెట్టేస్తున్న అనుష్క!

13-05-2021 Thu 11:22
  • అనుష్కకి విపరీతమైన క్రేజ్
  • 'భాగమతి'తో భారీ విజయం  
  • నిరాశపరిచిన 'నిశ్శబ్దం'
  • యూవీ బ్యానర్ పైనే నెక్స్ట్ మూవీ
Anushka keeping her offers in waiting list

తెలుగు, తమిళ భాషల్లో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకున్న సీనియర్ స్టార్ హీరోయిన్స్ లో అనుష్క ఒకరు. అలాంటి అనుష్క గ్లామరస్ పాత్రలను పక్కన పెట్టేస్తూ .. నటన ప్రధానమైన పాత్రలను ఎంచుకుంటూ రావడం మొదలుపెట్టి కొంత కాలమవుతోంది. లేడీ ఓరియెంటెడ్ కథల పట్ల మాత్రమే ఆమె ఆసక్తిని చూపుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే 'భాగమతి' తరువాత ఆమె చేసిన 'నిశ్శబ్దం' అంతగా ప్ర్రేక్షకులకు ఎక్కలేదు. అనుష్కను మాత్రమే కాదు .. ఆమె అభిమానులు కూడా నిరాశపరిచిన సినిమా ఇది.

ఆ తరువాత అనుష్క ఫలానా దర్శకుడితో ఫలానా సినిమా చేయడానికి అంగీకరించిందంటూ వార్తలు షికారు చేశాయి. అలా తరచూ ఎవరో ఒక దర్శకుడి పేరు వినిపిస్తూనే వస్తోంది. అయితే అనుష్కను సంప్రదించే దర్శక నిర్మాతల సంఖ్య తగ్గలేదట. కానీ తనే ఏ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదని అంటున్నారు. ఆమె నుంచి ఓకే అనే మాట వినడం కోసం వెయిట్ చేస్తున్న ప్రాజెక్టులు బాగానే ఉన్నాయని చెబుతున్నారు. కానీ అనుష్క ఒక్క యూవీ క్రియేషన్స్ వారి సినిమా మాత్రమే చేసే ఉద్దేశంతో ఉందట. అది లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ అయ్యుంటుందనే అంటున్నారు.