నా జీవితంలో తీసుకున్న అత్యుత్తమ నిర్ణయం ఇదే అయి ఉండొచ్చు: రానా భార్య మిహీక

13-05-2021 Thu 11:17
  • 'ఆమె ఎస్ చెప్పింది' అంటూ రానా పోస్ట్ చేసి ఏడాది
  • ఆ పోస్టును షేర్ చేసిన మిహీక
  • రానా త‌న మన‌సులో మాట చెప్పాడ‌ని వ్యాఖ్య‌
  • దీంతో అంగీక‌రించాన‌ని వెల్ల‌డి
mihika post about rana

'ఆమె ఎస్ చెప్పింది' అంటూ సినీనటుడు రానా ఏడాది క్రితం ఇదే స‌మ‌యంలో చేసిన ప్రకటన సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అయింది. తాను మిహీక బజాజ్‌ను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న‌ట్లు ఆయ‌న ప్ర‌క‌టించాడు. అనంత‌రం భల్లాలదేవుడు ఆమెను పెద్దల స‌మ‌క్షంలో క‌రోనా నిబంధ‌న‌లు పాటిస్తూ  ఆగస్టు 8న పెళ్లి చేసుకున్నాడు. అభిమానుల‌కు రానా త‌మ ప్రేమ గురించి తెలిపి ఏడాది అవుతుండటంతో రానా అప్ప‌ట్లో షేర్‌ చేసిన పోస్టును మిహీక బ‌జాజ్ త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో మరోసారి అభిమానులతో పంచుకుంది.

రానా తన మనసులో మాట చెప్పాడ‌ని, దీంతో తాను సరేనంటూ తలాడిస్తూ అంగీకరించాన‌ని మిహీక చెప్పింది. త‌న జీవితంలో తీసుకున్న అత్యుత్తమ నిర్ణయం ఇదే అయి ఉండొచ్చు అని తెలిపింది. అప్పుడే సంవత్సరం గ‌డిచిందంటే  తాను నమ్మలేకపోతున్నానని చెప్పింది. త‌న‌ను ఆ విష‌యం అడిగినందుకు రానాకు థ్యాంక్స్ తెలిపింది. ఐ లవ్‌ యూ రానా అని మిహీక పేర్కొంది.