కర్ణాటకలో 18 నుంచి 44 ఏళ్ల వారికి వ్యాక్సినేషన్ నిలిపివేత

13-05-2021 Thu 10:50
  • రెండో డోసు వేయించుకునే వారికోసం నిర్ణయం
  • 45 ఏళ్ల వారికే వ్యాక్సిన్ వేస్తామన్న ప్రభుత్వం
  • 44 ఏళ్లలోపు వారికి రేపటి నుంచి వ్యాక్సిన్ బంద్
Karnataka To Suspend Vaccination For 18 to 44 Age Group

18 నుంచి 44 ఏళ్ల వయసు వారికి కర్ణాటకలో రేపటి (మే 14) నుంచి కరోనా వ్యాక్సినేషన్ ను తాత్కాలికంగా నిలిపివేయనున్నారు. ఈ మేరకు వైద్యశాఖ నుంచి ప్రకటన వెలువడింది.

 తొలి డోసు వ్యాక్సిన్ వేసుకున్నవారికి రెండో డోసు కచ్చితంగా వేయాల్సి ఉందని... ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేస్తున్న వ్యాక్సిన్లను రెండో డోసు వేయించుకోవాల్సిన వారికి కేటాయిస్తామని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం అందించే వ్యాక్సిన్లను కూడా సెకండ్ డోసు వేయించుకోవాల్సిన 45 ఏళ్ల పైబడిన వారికే వేస్తామని చెప్పింది.

వ్యాక్సినేషన్ కోసం రిజిస్టర్ చేయించుకున్నప్పటికీ... 18 నుంచి 44 ఏళ్ల వయసు వారికి వ్యాక్సినేషన్ ను ఆపేస్తున్నామని చెప్పారు. అన్ని ప్రభుత్వ వ్యాక్సినేషన్ సెంటర్లకు ఈ షరతులు వర్తిస్తాయని తెలిపింది. తొలి డోసు వ్యాక్సిన్ వేయించుకున్న ఎంతో మంది రెండో డోసు టీకా దొరక్క ఎన్నో ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. సమయం మించి పోతుండటంతో వారు ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే, కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.