Mahesh Babu: 'సర్కారువారి పాట'లో కీర్తి సురేశ్ పాత్ర అదేనట!

Keerthi Suresh is seen as a Bank Employee in Sarkaruvaari Paata
  • షూటింగు దశలో 'సర్కారువారి పాట'
  • బ్యాంక్ మేనేజర్ గా మహేశ్ బాబు
  • బ్యాంక్ ఉద్యోగినిగా కీర్తి సురేశ్
  • సంక్రాంతికి భారీస్థాయిలో విడుదల
పరశురామ్ దర్శకత్వంలో మహేశ్ బాబు కథానాయకుడిగా 'సర్కారువారి పాట' రూపొందుతోంది. ఈ సినిమాలో కథానాయికగా కీర్తి సురేశ్ నటిస్తోంది. హీరో .. హీరోయిన్ ఏం చేస్తుంటారు? వాళ్ల పరిచయం ఎలా జరుగుతుంది? అనేదే ఏ సినిమాలోనైనా ప్రధానమైన ఆసక్తిని రేకెత్తించే అంశం అవుతుంది. అలాగే ఈ సినిమాలో కూడా మహేశ్ బాబు .. కీర్తి సురేశ్ ఎలా తారసపడతారు? ఎలా లవ్ లో పడతారు? అనే విషయాలను తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తిని చూపుతున్నారు.

ఈ సినిమాలో మహేశ్ బాబు ఓ బ్యాంకుకి మేనేజర్ గా కనిపిస్తాడట. అదే బ్యాంకులో కీర్తి సురేశ్ ఒక ఉద్యోగినిగా పనిచేస్తూ ఉంటుందట. అలా అక్కడ వాళ్ల మధ్య పరిచయం మొదలై ప్రేమగా మారుతుందని అంటున్నారు. ఇక పెద్దమొత్తంలో బ్యాంకు నుంచి రుణాలు తీసుకుని ఎగ్గొట్టడానికి ప్ర్రయత్నించే వాళ్ల ఆటకట్టించడానికి మహేశ్ బాబు వేసే ప్లాన్స్ లో కీర్తి సురేశ్ పాలుపంచుకుంటుందని చెబుతున్నారు. ఈ సినిమాలో కీర్తి సురేశ్ మునుపటి గ్లామర్ తో ఆకట్టుకుంటుందనీ, కామెడీ కూడా చేస్తుందని అంటున్నారు. 'సంక్రాతి'కి ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
Mahesh Babu
Keerthy Suresh
Parashu Ram

More Telugu News